నా పెళ్లి విషయంపై తొందరెందుకు.. నేనే చెబుతా..కాజల్ అగర్వాల్


టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో 'లక్ష్మీ కళ్యాణం' మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. తొలిసినిమా పెద్దగా గ్లామర్ షో చేయకున్నా తన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత గ్లామర్ షో అలరించింది కాజల్. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది ఈ హాట్ బ్యూాటీ.


ఆ మద్య ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తూ వస్తుంది. గత కొంత కాలంగా కాజల్ వివాహం పై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. దాంతో ప్రతిసారి తన వివాహ విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తుంది. తన చెల్లెలు నిషా అగర్వాల్ సైతం తెలుగు సినిమాల్లో నటించింది. గత కొంత కాలం క్రితం ఆమె వివాహం జరిగింది. ప్రతి సంవత్సరం తన చెల్లెలి వద్దకు వెళ్లి వారి కుటుంబంతో సంతోషంగా గడిపి వస్తుంది. తన చెల్లెలు నిషా అగర్వాల్, ఆమె కుమారుడు ఇషాన్ వలేచాతో హాలీడేను కాజల్ ఆస్వాదిస్తోంది. నిషా అగర్వాల్ 'ఏమైంది ఈవేళ' సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి వ్యాపారవేత్త కరణ్ వలేచాను వివాహం చేసుకుంది. వీరికి ఇషాన్ వలేచా సంతానం. అప్పటి నుంచి కాజల్ వివాహం ఎప్పుడు చేసుకోబోతుంది..ఆమెకు ఎలాంటి వరుడు కావాలీ అంటూ రక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూ లో తన వివాహం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గత కొద్దిరోజులుగా తన పెళ్లిపై వస్తున్న వదంతులపై నోరు విప్పారు... అలాంటివి నమ్మవద్దని కోరారు. పెళ్లి గురించి తానే ఓ క్లారిటీ ఇస్తానన్నారు. ప్రస్తుతం ఇతర భాషల్లోని పలు సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాజల్‌ పెళ్లి పీటలెక్కనుందన్న వార్తలు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

No comments

Powered by Blogger.