'చచ్చిపోతా'నంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన తెలుగు హీరోయిన్


డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు కానీ, నేను బాగానే ఉన్నాను.. ఉంటాను నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను.

'నచ్చావులే' సినిమా హీరోయిన్ మాధవీలత  తన పేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై స్పందించి వివరణ ఇచ్చింది.

నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే... మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను. రిలాక్స్‌ కండి.. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను జస్ట్ క్యాజువల్ గా, నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా #మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను' అని ఆమె వివరణ ఇచ్చింది.

No comments

Powered by Blogger.