 |
twitter |
దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా నిన్న భారత్తో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. దీనితో వారు తొలిసారిగా ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యువ ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లలకు అభివాదం చేయడం అంతర్జాతీయ క్రికెట్లో ఆనవాయితీ.
కానీ దాన్ని మరిచిన బంగ్లా ప్లేయర్స్.. భారత్ ఆటగాళ్లను గేలి చేస్తూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఓ ఆటగాడు అయితే ఏకంగా భారత క్రికెటర్లతో వాగ్వాదానికి కూడా దిగాడు. చివరికి అంపైర్లు కలగజేసుకునే వరకు రెండు జట్ల మధ్య గొడవ సద్దుమణగలేదు.
Post a Comment