బ్యాంకు లో నందమూరి బాలకృష్ణ భార్య సంతకం ఫోర్జరీ


నటసింహం నందమూరి బాలకృష్ణ గారి భార్య వసుంధర సంకం ఫోర్జరీ చేశారు. ఆమెకు తెలియకుండానే మొబైల్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. ఇది నిజమని అనుకొని నిర్ధారించుకునేందుకు బ్యాంకు అధికారులు ఆమెకు ఫోన్ చేయగా అసలు విషం తెలిసింది.

తాను ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీంట్లో ఓ బ్యాంకు ఉద్యోగి ఈ పని చేసినట్టుగా గుర్తించారు. వసంధరకు బంజారాహిల్స్ బ్రాంచ్‌కు చెందిన ఎచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంది. దానికి మొబైల్ యాప్ కోసం దరఖాస్తు వచ్చిందిజ దీనిపై సమాచారం కోసం బ్యాంకు అధికారులు ఆమెను సంప్రధించారు. ఆమె ఆ సంతకాలు చేయకపోవడంతో విచారణ ప్రారంభించారు. బ్యాంకులో కొత్తగా చేరిన అకౌంటెంట్‌ కొర్రి శివ ఈ పని చేసినట్టు నిర్ధారించారు. అతడే వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై వసంధర తరుపున ఆర్థిక లావాదేవీలు చూసే వ్యక్తి పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. శివ ఎందుకు ఈ విధంగా ఫోర్జరీ చేయాల్సి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

No comments

Powered by Blogger.