తెలంగాణలో రెండురోజులు వర్షాలు...హైదరాబాద్‌లో భారీ వర్షం


తెలంగాణ: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలోని మరాఠ్వాడాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాలు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారుల తెలిపారు.

No comments

Powered by Blogger.