తెలంగాణలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారు- మంత్రి ఈటెల…

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 10 మందికి నెగిటివ్‌ వచ్చిందని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రెండు రోజులు పర్యవేక్షించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. నిన్న, ఇవాళ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు. క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే పోలీసులు జైలుకు పంపుతారని హెచ్చరించారు.

No comments

Powered by Blogger.
close