‘గుడ్ న్యూస్’ తెలంగాణలో కోలుకుంటున్న కరోనా బాధితులు: 11మందికి నెగిటివ్…


కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11మందికి రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చింది. ఇది మంచి పరిణామం అని డాక్టర్లు అంటున్నారు.కరోనా సోకిన వారు కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
కరోనాకి ఇప్పటివరకు వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్లలేదు. ఈ పరిస్థితుల్లో కరోనా సోకితే చనిపోవాల్సిందే అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకిన వారు కోలుకుంటున్నారు అనే వార్త అందరిలోనూ విశ్వాసం నింపింది.

మనో ధైర్యమే కరోనాకు మందు అని డాక్టర్లు ముందు నుంచి చెబుతున్నారు. మానసికంగా ధృడంగా ఉంటే కరోనా ఏమీ చేయలేదని అంటున్నారు. కాగా, తెలంగాణలో తొలి కరోనా బాధితుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీ కల్లా మరింత మంది కోలుకుంటారని, గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన విషయం విదితమే. తెలంగాణలో ఇప్పటివరకు 67మంది కరోనా బారిన పడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

No comments

Powered by Blogger.
close