’20 టన్నుల మామిడి’ అరగంటలో అమ్మేశారు..!
రెండు వారాలుగా బోసిపోయిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఆదివారం కళకళలాడింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రైతులు తెచ్చిన 20టన్నుల మామిడి కాయలు అరగంటలోనే అమ్ముడయ్యాయి. కొనుగోలుదారులు ఉదయం 6గంటలకే పండ్ల మార్కెట్కు చేరుకుని కొనుగోలుకు పోటీపడ్డారు. టన్ను ధర రూ.30 నుంచి 60వేలు పలికినట్లు తెలిసింది. ఈ ఏడాది మామిడి సీజన్ ఆలస్యం కావడం, కరోనా మహమ్మారి రైతులను ఇబ్బందులకు గురిచేసింది. సీజన్ ఇప్పుడు మొదలవడంతో రానున్న రోజుల్లో భారీగా మామిడి వచ్చే అవకాశం ఉంది.
Post a Comment