కరోనా! కేజీ చికెన్ 20/40, కోళ్ళమేతకు ఖర్చు భరించలేక…



కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమల నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్‌ తింటే కరోనా విస్తరిస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో, ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే:



బెలగావిలోని గోకాక్‌కు చెందిన నజీర్‌ అహ్మద్‌ అనే పౌల్ట్రీ నిర్వహకుడు చికెన్‌ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్‌లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



ఈ ఘటనకు సంబంధించి నజీర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ: కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి రూ. 6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా, నష్టాలు వచ్చే అవకాశం ఉన్నారు. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు…

No comments

Powered by Blogger.