ఒక్కడి పాపం, నిర్లక్ష్యం.! 5మందికి కరోనా|బాధితుల్లో 9 నెలల చిన్నారి…


క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తి.. తొమ్మిది నెలల పాపతో సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురికి కరోనావైరస్‌ (కొవిడ్‌-19) సోకడానికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 15కు చేరింది.బ్రిటన్‌లో చదువుతున్న ఓ యువకుడు ఇటీవల భారత్‌కు తిరిగివచ్చాడు. అతడిని దిల్లీలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అయితే నిబంధనలను అతిక్రమించి అతడు పశ్చిమ్‌బెంగాల్‌కు చేరుకున్నాడు. స్థానిక తెహత్తాలో ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. ఆ వక్తికి కరోనా పాజిటివ్‌ అని ఆ తర్వాత నిర్ధారణ అయింది. ఈలోగా అదే శుభకార్యంలో పాల్గొన్న 27 ఏళ్ల మహిళకు ఆ యువకుడి ద్వారా కరోనా సోకింది. ఆ మహిళతోపాటుగా ఆమె 9 నెలల కుమార్తెకు, ఆరు సంవత్సరాల కుమారుడికి… అదే కుటుంబంలోని 45 ఏళ్ల మరోమహిళకు, ఆమె కుమారుడికి (11) కూడా కరోనా వ్యాప్తించింది.ప్రస్తుతం ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని దిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎనిమిది మంది సభ్యులున్న ఆ మహిళ కుటుంబాన్ని మార్చి 23 నుంచి క్వారంటైన్‌లో ఉంచారు. కాగా వారిలో ఈ ఐదుగురికి కరోనా పాజిటివ్‌ అని ఈ రోజు తేలింది. దీంతో వారందరినీ ఐసొలేషన్‌ వార్డుకు, ఆ ప్రాంతానికి చెందిన మరో 18 మందిని క్వారంటైన్‌కు పంపి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

No comments

Powered by Blogger.