ఆ యువతి ద్వారా 5000 మందికి కరోనా ! దేశమంతటా వ్యాప్తి..!


కరోనా వైరస్ ప్రపంచమంతటినీ వణికిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు‌హెచ్‌ఓ) కరోనా వ్యాధిని మహమ్మారిగా ప్రకటించింది. అయితే కొంతమంది అవగాహనా లేమి, నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి ఉదంతమే దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువతి కారణంగా వేలాదిమందికి కరోనా వైరస్ సోకింది. వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియాకు చెందిన వైద్య శాస్త్రవేత్తలు తమ దేశంలో కరోనా వ్యాప్తికి మూల కారణాన్ని కనుగొన్నారు.ఒక యువతి నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది కరోనా వైరస్ బారిన పడినట్లు వారు వెల్లడించారు. కరోనా బారిన పడిన ఒక మహిళ ఉదయం ప్రార్థనల కోసం ఒక చర్చికి వెళ్లింది. దీంతో ఆ సమయంలో అక్కడున్న 1,200 మంది కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయారు. తరువాత ఆ యువతి ఫిబ్రవరి 6న ఒక చిన్న ప్రమాదాన్ని ఎదుర్కొన్న నేపధ్యంలో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ సమమంలో ఆసుపత్రిలో ఉన్న 119 మందికి ఆమె ద్వారా కరోనా వైరస్ సోకింది.ఈ పరిస్థితి ఇంతటితో ఆగలేదు. ఫిబ్రవరి 14న ఆమె వాలంటైన్స్ డే సందర్భంగా ఒక హోటల్‌కు వెళ్లింది. దీంతో అక్కడున్న మరికొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విధంగా ఒక్క యువతి ద్వారా దక్షిణ కొరియాలో ఈ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందింది. కాగా ఆ మహిళ తనకు కరోనా వైరస్ సోకిందని గుర్తించకపోవడం కారణంగా ఈ వ్యాధి 5000 మందికి వ్యాప్తి చెందింది. ఈమె కారణంగా కరోనా వైరస్ సోకినవారిలో పలువురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొదుతున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

🔹ప్రాణం చాలా విలువైనది !
🔹పోతె తిరిగిరాదు !
🔹మన అనుకున్న వారి కోసం !
🔹మన కోసం !
🔹స్వీయ గృహ నిర్బంధం చేసుకుందం !
🔹భరత ఖండం అన్నింటిలో అఖండ విజయలను సాధించింది !
🔹ఇప్పుడు ఈ కరోన అనే మహమ్మరి నుండి కూడ మనము విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆ పరమేశ్వరుడి కోరుకుందాము🙏

No comments

Powered by Blogger.