తెలంగాణలో మరో కరోనా కేసు ! తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 7…
తెలంగాణలో ఆరో కరోనా కేసు నమోదైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ అని తేలిన వారి సంఖ్య ఆరుకి చేరింది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. మొట్టమొదట పాజిటివ్ కేసును గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్‌ చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ తెలంగాణలో దుబాయ్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్, ఇండోనేషియా, బ్రిటన్ నుంచి వచ్చినవారికి కరోనా పాజిటివ్ గా తేలింది.

No comments

Powered by Blogger.
close