మనిషి కాదు వీడు పశువు…! 9 నెలల లేగదూడపై లైంగికదాడి ...


సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది ! మానవత్వానికి మాయని మచ్చ ఇది. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. శునకాలు, మేకలు, ఆవులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా9 నెలల లేగదూడపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. హైదర్‌గూడ అవంతినగర్‌లో నివాసముండే శివకుమార్‌కు స్థానికంగా పశువుల కొట్టముంది. అందులో మహేశ్‌(30) బాల్యం నుంచి పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి మహేశ్‌ లేగదూడపై లైంగికదాడికి పాల్పడుతున్న సంఘటన ఆ కొట్టం పక్కనే ఉన్న ఇంటి యజమాని కిషోర్‌వర్మ దృష్టిలో పడింది. వెంటనే ఆయన నారాయణగూడ పోలీసులకు సమాచారమందించారు. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌, ఎస్సై నారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి, మహేశ్‌ను అరెస్టు చేశారు.

No comments

Powered by Blogger.