అమెరికాలో కరోనా అదుపు తప్పింది.! రంగంలోకి సైన్యం..


అమెరికాలో కరోనా అదుపు తప్పింది. రంగంలోకి సైన్యం
అమలులోకి అరుదైన డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌…అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన అమెరికా.. లక్ష మార్క్‌ దాటిన తొలి దేశంగా నేడు రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కేసులు నమోదైన దాఖలాలు లేవు. అలాగే ఇప్పటి వరకు 1500 మంది వైరస్ బారిన పడి మరణించారు.ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ: మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాలకపక్షం అన్ని చర్యలు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు. వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్‌ రంగంలోకి దించారు. ఇప్పటికే అన్ని మార్గాల్ని అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేతసౌధం. ఆఖరి అస్త్రాల్లో ఒకటైన డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ని కూడా తాజాగా అమల్లోకి తెచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది.

No comments

Powered by Blogger.