కరోనా భయంతో షిరిడి ఆలయం మూత..! ఆలయ ట్రస్ట్ అధికారిక ప్రకటన…


కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యధిక రద్దీ ఉండే ప్రముఖ షిరిడీ దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే 125కరోనా కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో దీని తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 39కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధిక రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో కూడా ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

No comments

Powered by Blogger.