నా తల్లి దగ్గరకి నేను వెళ్లి ఉండలేను ! కాని నాతో ఉంటానంటే అభ్యంతరం లేదు…
మారుతీరావు ఆత్మహత్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమృత బాబాయ్ శ్రవణ్‌‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇవాళ మారుతీరావు అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, బాబాయ్ నుంచి అమ్మకు ప్రాణహానీ ఉంటుందని అమృత ఆరోపించింది. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేశాడనుకుంటున్నానని అమృత అనుమానం వ్యక్తం చేసింది…బినామీల పేర్లతో ఆస్తులు:‘శ్మశనవాటికకకు వెళ్తే అడ్డుకున్నారు. శ్రవణ్‌ కూతురు నన్ను నెట్టేసింది. ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా, ఇప్పుడెందుకు ఉండలేను. కరీంతో పాటు చాలా మంది పేర్లపై బినామీ ఆస్తులున్నాయి. నా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. నా తల్లి దగ్గరకి వెళ్లి ఉండలేను. నాతో ఉంటానంటే అభ్యంతరం లేదు. అత్తింటి వారిని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేను’ అని అమృత చెప్పుకొచ్చింది.బాబాయ్ శ్రవణ్ ఏమన్నాడు ?కాగా, మారుతీరావు ఆత్మహత్య అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ: మారుతీరావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, చాలా రోజులుగా తామిద్దరి మధ్య మాటల్లేవని చెప్పిన సంగతి తెలిసిందే. మా కుటుంబంలో ఎటువంటి ఆస్తి వివాదాలు లేవని, ప్రణయ్‌ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా జైలు శిక్ష అనుభవించానని చెప్పుకొచ్చాడు. కేసు విషయంలోనే మారుతీరావు ఆందోళనగా ఉన్నాడని, కేసు ట్రయిల్ దశకు వచ్చిందని, దాని వల్లే ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశాడు…

No comments

Powered by Blogger.