అపోలో ఆస్పత్రిలో చేరిన దత్తన్న..
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉన్న ఆయనకు ఉదయం గుండెల్లో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందించారు వైద్యులు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయనకి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. తెలంగాణా బీజేపీ నాయకుడయిన బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన సొంత నివాసం ఇక్కడే ఉండడంతో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై తో కలసి ఆయన మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ కి తిరిగి వెళ్లాల్సి ఉంది. ఇంతలోగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.


No comments

Powered by Blogger.