తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..!కరోనా ప్రభావంగా ఇప్పటికే పలు ఇండస్ట్రీలు నష్టాల భారిన పడగా, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో భాగంగా ప్రభుత్వాలు ముందస్తు చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలో థియేటర్లను కూడా బంద్ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.ఈ క్రమంలోనే తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌ సభ్యులు శనివారం (14 మార్చి 2020) ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌ ఆవరణలో భేటీ కానున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, థియేటర్ యజమానులు అందరూ కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు లేదా కనీసం ఉగాది వరకు థియేటర్లను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.ఏపీ, తెలంగాణలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కావడంతో, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. దీంతో థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచనలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకుంటేనే మంచిదని అప్పుడు కొన్ని వెసులుబాట్లు ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది.No comments

Powered by Blogger.
close