కరోన కష్టకాలం ! జీతాల్లో కోత|కేసీఆర్ కీలక నిర్ణయం…


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై సీఏం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్షించారు. వైరస్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైనందువల్ల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు.సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పోరేషన్‌ ఛైర్మన్లు, స్థాని సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ పరిధిలోకి వస్తారు.మరోవైపు తెలంగాణలో అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, మిగిలిన అన్ని కేటగిరీ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగో తరగతి, పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత పడనుంది.తెలంగాణలో అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌న్లలో 50 శాతం కోత విధించనున్నారు. నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 10శాతం కోత పడనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులు వేతనాల్లోనూ కోత విధించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత పడనుంది.
No comments

Powered by Blogger.