హైదరాబాద్‌లో ‘కరోనా వైరస్’ కలకలం ! ఆల్-ది-బెస్ట్ చేప్పిన చార్మీ…


తెలంగాణలో కరోనా వైరస్ కలకలంపై మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు: బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లాడని, హాంకాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడన్నారు. తర్వాత బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడన్నారు. జ్వరం వచ్చిందని నిన్న గాంధీ ఆస్పత్రికి వచ్చాడని, యువకుడి శాంపిల్స్‌ను పుణె పంపామన్నారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని మంత్రి తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ రాలేదని ఈటల స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్‌లు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దేశంలో కరోనాతో ఎవరూ చనిపోయిన సంఘటనలు లేవన్నారు. యువకుడు ఎవరెవరిని కలిశాడో వాళ్లకు కూడా పరీక్షలు చేస్తామన్నారు. యువకుడి కుటుంబ సభ్యులు అతనితో బస్సులో ప్రయాణించిన వాళ్లకి పరీక్షలు చేస్తామన్నారు. 14 రోజుల పాటు వ్యక్తిని వైద్యులు పర్యవేక్షిస్తారని ఈటల రాజేందర్ చెప్పారు.

అల్ డి బెస్ట్ చేప్పిన చార్మీ:
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వేలాది మంది కరోనా వైరస్ సోకి చనిపోగా అనేక దేశాల్లో వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లేటెస్టుగా కరోనా వైరస్ ఇండియాకు వచ్చింది. రెండు కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఒక కేసు ఢిల్లీలో నమోదు కాగా, మరో కేసు హైదరాబాద్ లో నమోదైంది. దీంతో ప్రజల్లో భయం వ్యక్తమవుతోంది. భయాందోళనలో జనం ఉంటే సినీ నటి చార్మీకి మాత్రం సెటైర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు, ఢిల్లీ, తెలంగాణకు కరోనా వచ్చేసిందట నేను ఇప్పుడే వార్తల్లో చూసాను అల్ డి బెస్ట్ అంటూ వెటకారంగా నవ్వుతున్న ఓ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం చార్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments

Powered by Blogger.