అయాన్‌ స్కూల్‌ ఫంక్షన్‌ ! అల్లు కుటుంబం సందడి…


అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ స్కూల్‌ ఫంక్షన్‌లో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. తన కుమారుడు ప్రీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయని కొన్ని రోజుల క్రితం బన్నీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయాన్‌ పట్ల చాలా గర్వంగా ఉందంటూ అతడికి జీవితం విలువలు నేర్పిన పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు.కాగా ఈ వేడుకల్లో బన్నీ, స్నేహారెడ్డి, అల్లు అరవింద్‌, అల్లు నిర్మల పాల్గొన్నారు. స్టైలిష్‌ స్టార్‌ కుమార్తె అర్హ, అయాన్‌ మిగిలిన చిన్నారులతో పాటు వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. తన పిల్లలు డ్యాన్స్‌ చేస్తుంటే బన్నీ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. చివరిగా బన్నీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్‌ మెడల్స్‌, పత్రాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అర్హ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

No comments

Powered by Blogger.