దయనీయ పరిస్థితి కరోనా భయంతో మృతదేహాన్ని ముట్టని జనం…


కరోనా ఎంత ప్రమాదకర వైరసో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఇది మన ఇండియాలో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికీ మన దేశంలో 584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ను నిర్మూలించేందుకు 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఒకరినొకరు తాకాలంటేనే భయపడుతున్నారు.ఈ వైరస్ వస్తే ఏ ఒక్కరితోనే పోదు. అది వాళ్ల కుటుంబం, వాళ్ల సన్నిహితులను కూడా బలిచేస్తుంది. అందుకే చనిపోతే మృతదేహాలను కూడా చూడనివ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇవాళ కరీంనగర్ కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వద్ద ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ భయంతో మృతదేహం వద్దకు ఒక్కరు కూడా రాలేదు. దీంతో అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

No comments

Powered by Blogger.