అవాస్తవాలు ప్రచారం చేస్తే కేసులు పెడతాం: కలెక్టర్ శ్వేతా మహంతి


హైదరాబాద్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌ ఎక్కడా ప్రకటించలేదని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. రెడ్ జోన్ ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పారు. ఫిలింగనర్ లో కరోనా పాజిటివ్ కేసులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఫిలింనగర్ బస్తీల్లోకి కరోనా వైరస్ విస్తరించిందని పలు వెబ్ సైట్ లలో, నెట్టింట్లో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.అటు జిహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో రెడ్‌ జోన్లు లేదని స్పష్టం చేశారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వాటిని నమ్మొద్దన్నారు. కరోనాపై వాట్సాప్ లో ప్రజలను భయందోళన గురిచేసే విధంగా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
No comments

Powered by Blogger.