వరంగల్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…


తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉంటున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.కానీ, ఇప్పుడు కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్ లోనే కరోనా టెస్టులు చేసేవారు. ఇప్పుడు తెలంగాణలో మరో టెస్ట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది. వరంగల్ లోని ప్రభుత్వ హాస్పటల్ లో కరోనా టెస్టులు చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

No comments

Powered by Blogger.