అమృతకు షాక్: స్మశానం లోకే అడుగుపెట్టనివ్వని బంధువులు…


అమృతకు చివరి చూపు కూడా దక్కలేదు:

మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి. వాటిలో పాల్గొనేందుకు కూతురు అమృతతోపాటూ, ప్రణయ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఐతే, అమృతను చూడగానే అక్కడున్నవారంతా అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో అమృత షాకైంది. ఆమె ఎంత ప్రయత్నించినా, మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు.

ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో తండ్రిని కడసారి చూసిన అమృత అంత్యక్రియలు చూడకుండానే అక్కడి నుంచీ వెళ్లిపోయింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడానికీ, ఆయనకు ఈ గతి పట్టడానికీ అమృతయే కారణమని స్థానికులంతా ఆగ్రహంతో ఉన్నారు. కాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావు నిన్న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు ఆయన ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను ఫోరెన్సిక్ వైద్యులు బయటపెట్టారు. ఆయన విషం తీసుకోవడం వల్లే చనిపోయారని, ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని స్పష్టం చేశారు. విషం తీసుకోవడం వల్లే ఆయన శరీరం రంగు మారిందని వివరించారు. శరీరానికి రక్తప్రసరణ ఆగిపోవడంతో గుండె పోటు వచ్చిందని, బ్రెయిన్‌డెడ్ అయ్యారని ప్రాథమిక రిపోర్టులో వెల్లడించారు.

No comments

Powered by Blogger.