అమృత! ఆఖరి చూపు చూడకుండానే…హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తె అమృత ప్రయత్నించింది. మృతదేహాన్ని చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని ఈ ఉదయం కోరింది. ఈ మేరకు ఆమె పోలీసు భద్రత మధ్య తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు చేరుకుంది. అయితే ఆమె రాకను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహం వద్దకు రాకుండా అమృతను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.

No comments

Powered by Blogger.