రోడ్లో తుమ్మాడని వ్యక్తిపై దాడి…కొల్లాపూర్‌లోని గుజారి ప్రాంతానికి చెందిన వ్యక్తి పబ్లిక్‌లో తుమ్మాడు. కానీ ఆ సమయంలో చేతులు అడ్డుపెట్టుకోవడం కానీ, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయి.. అతన్ని వెంబడించాడు.బైక్‌పై వెళుతున్న అతన్ని రోడ్డుపై ఆపి మాస్క్‌ పెట్టుకోకుండా ఎందుకు తుమ్మావని ప్రశ్నించాడు. దానికి అతను నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. తుమ్మిన వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్‌ అయింది. స్థానిక వ్యక్తులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఈ దాడి అక్కడి సీసీ టీవీలో రికార్డైంది.

No comments

Powered by Blogger.