దేశంలో కరోనా స్పీడ్ ! జాగ్రత్త..!


 
దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కేసులు తాజాగా 492కు చేరాయి. వీరిలో 37మంది కోలుకోగా 446మంది ప్రస్తుతం ప్రత్యేక పరిశీలనలో ఉన్నారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటికే 23 రాష్ట్రాల్లో విస్తరించిన కొవిడ్‌-19తో మరిణించిన వారిసంఖ్య తొమ్మిదికి చేరింది. నిన్న ఒక్కరోజే కేరళలో అనూహ్యంగా కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 95కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య 87కు చేరింది. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ప్రధానమంత్రి సూచనమేరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రధానమంత్రి సూచించిన విషయం తెలిసిందే.

No comments

Powered by Blogger.