విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చి క్వారంటైన్‌ వెళ్లకుండా బాయ్‌ ఫ్రెండ్‌తో…


నిజామాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా భర్త, పిల్లలతో కలిసి సింగపూర్‌లో స్థిరపడింది. నాలుగు రోజుల క్రితం సెలవులపై సింగపూర్‌ నుంచి నగరానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. అనంతరం చేతిపై ముద్ర వేసి ఇంట్లోనే ఉండాలని చెప్పి పంపారు.అయితే ఆమె తన స్వస్థలానికి చేరుకోకుండా ఓల్డ్‌బోయినపల్లి రాజారెడ్డి కాలనీలోగల సాయిరెసిడెన్సీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటోంది. కాగా హోమ్‌ క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండాల్సిన ఆమె ఆదివారం రాత్రి హస్మత్‌పేటకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మద్యం పార్టీ చేసుకుంది. పార్టీలో మద్యం తాగి చిందులు వేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించింది.ఇది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు అప్పటికి ఊరుకున్నారు. సోమవారం సాయంత్రం సదరు మహిళను అపార్ట్‌మెంట్‌లో ఉండే వారు బయటకు పిలిచి నిలదీశారు. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో ఆమె చేతికి ఉన్న క్వారంటైన్‌ స్టాంపును గమనించారు. వెంటనే ఆమెను రూమ్‌లో బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళతో పాటు, యువకుడిని విచారించారు. దాంతో ఆ యువకుడు ఆమె భర్త కాదు, బాయ్‌ఫ్రెండ్‌ అని తేలింది. బోయినపల్లి పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ ఎవరిది,? అక్కడ ఆమె ఇంకా ఏం చేసింది ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు…

No comments

Powered by Blogger.