సూపర్ మార్కెట్లో బన్నీ.! ఏం చేస్తున్నాడో చూడండి…


కరోనా వైరస్ ఉన్నోడు లేనోడు అనే తేడాను చూపించడం లేదు. అందరిని ఇంటికే కట్టిపడేసింది. ఎవరూ అడుగు బయటపెట్టిన అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో ఎవరూ బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో అన్ని సేవలు నిలిచిపోయాయి. దీంతో సెలబ్రెటీలు కూడా ఇంటిపని, వంటపని వారే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాలు, మెడిసిన్స్ ఏది కావాలన్నా స్వయంగా వచ్చి తీసుకెళ్తున్నారు.ఇలా ఇంటికి సరుకులు తీసుకెళ్తుండగా టాలీవుడ్ హీరో అల్లూ అర్జున్ కెమెరాకు చిక్కాడు. జూబ్లిహిల్స్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యాడు. మొహానికి మాస్క్ వేసుకుని షార్ట్, టీ షర్ట్‌తో వచ్చాడు. చాలా సేపు అతడు అక్కడే ఉన్నాడు. బాడీగార్డ్స్ లేకుండానే సాధారణ వ్యక్తిలా వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకెళ్లాడు. బన్నీని కొందరు గుర్తుపట్టి ఫోటోలు తీశారు. దీన్ని చూసిన వారంతా కరోనా సెలబ్రిటీలను కూడా సాధారణ పౌరుల్లా మార్చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

No comments

Powered by Blogger.
close