బాడీ షేప్ మార్చుకున్న లక్ష్మి … బికినీ కోసమే పుట్టినట్టు

చాలా ఏళ్ళుగా మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రాయ్‌ లక్ష్మి అనుకున్న విధంగా ఒక చిత్రం కూడా హిట్‌ కావడం లేదు. ఇక నుంచి మీరు కొత్త రాయ్‌ లక్ష్మిని చూస్తారని అంటోంది బెంగళూరు భామ. తన బాడీషేప్‌తో పాటు మనసు కూడా తేలికగా మారిందని అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘సిండ్రిల్లా’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘నీయా2’ కూడా నిరాశపరిచింది. ఆ చిత్రంలో తన అందచందాలను ఆరబోసినా కూడా సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా తాను మాత్రం మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తూనే వుంది. ప్రస్తుతం ‘సిండ్రిల్లా’ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బికినీలో ఫోజు ఇస్తూ తీసిన ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా మళ్లీ తన బాడీ బికినీ షేప్‌కు మారిందని, బాడితో పాటు మనసు కూడా చాలా తేలికగా వుందని పోస్ట్‌ చేసింది.

No comments

Powered by Blogger.