వూహాన్‌‌లో తగ్గిన కరోనా/ మాస్కులు తీసేస్తున్న డాక్టర్లు…

 

వూహాన్.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకువచ్చేది కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇక్కడే పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు తీసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతుండగా, వూహాన్ మాత్రం ఇప్పుడు ఈ మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడింది. వూహాన్‌లో కొత్త కేసుల నమోదు కావడం పూర్తిగా ఆగిపోయింది.దీంతో ఇప్పటి వరకు నిర్బంధంలో ఉన్న హుబేయి ప్రావిన్స్‌ ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న కట్టదిట్టమైన చర్యల వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్ని హాస్పిటల్స్‌ను ప్రభుత్వం మూసివేసింది. ఇన్నాళ్లూ ముఖానికి మాస్కులతో కరోనా బాధితులకు సేవలు అందించిన వైద్యులు వెళ్తూవెళ్తూ ముఖాలకు మాస్కులు తొలగించి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

No comments

Powered by Blogger.