ఆడపిల్లకు జన్మనిచ్చిన ‘దిశ’ నిందితుని భార్య…





హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ సమయంలోనే రేణుకా గర్భవతిగా ఉన్న విషయం విదితమే. పురిటినొప్పులతో గురువారం మధ్యాహ్నం రేణుకా కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈక్రమంలో శుక్రవారం ప్రసవం జరిగిందని, తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు.

దిశ కేసులో మరో ట్విస్ట్:

దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల కుటుంబాలు అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని, నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ దిశా రేపిస్టుల కుటుంబాలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను తిరస్కరించి దిశ కేసుపై ఏర్పాటు చేసిన జ్యూడిషియల్ కమిషన్ ను కలవాలని ఆదేశించింది. దీంతో దిశ నిందితుల కుటుంబాలు గురువారం హైదరాబాద్ లో కమిషన్ ను కలిశాయి.



తాజాగా వీరి కేసు జ్యూడిషయల్ కమిషన్ ముందుకు వచ్చింది. నలుగురు దిశా నిందితుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వారు కోరుతూ తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. దిశపై మానవమృగాలుగా నలుగురు రేపిస్టులు చేసిన దారుణంపై దేశమంతా నిరసన తెలిపింది. ఆందోళనలు సాగాయి. వారి ఎన్ కౌంటర్ తో అందరూ శాంతించారు. ఇలాంటి క్రూరులకు బతికే చాన్స్ లేదని స్పష్టం చేశారు.

No comments

Powered by Blogger.