ఇష్టమైనవి పెట్టండి ప్లీజ్ ! వైద్యులను బతిమిలాడుతున్న కరోనా అనుమానితులు !!
గాంధీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరుతున్న కొందరు అనుమానితులు తమకు ఇష్టమైన ఆహారం తెప్పించాలని వైద్యులను వేడుకుంటున్నారు. కొందరు తామే సొంతంగా స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా అనుమానంతో ఇటీవల గాంధీలో చేరారు. ఒకరోజుపాటు ఐసోలేషన్లో ఉన్న వీరు.. తమకు కేఎఫ్సీ నుంచి ఆహారం తెప్పించాలని కోరారు. వాస్తవానికి ఆసుపత్రిలో చేరిన వారికి అక్కడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తారు.
ఐసోలేషన్లో ఉన్నవారిలో కొందరికి ఈ ఆహారం రుచించడం లేదు. ఇక అవుట్ పేషెంట్ల కింద కొందరు అనుమానితులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో కొందరు ఫుడ్ యాప్ల ద్వారా ఆహారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఆర్డర్లు హెల్ప్డెస్కు వరకు చేరుతుండగా అక్కడ నుంచి సిబ్బంది ఐసోలేషన్ వార్డుకు చేర్చుతున్నారు. జలుబు, దగ్గు లాంటి సాధారణ లక్షణాలు ఉన్నవారికి మానవతా దృక్పథంతో బయటి ఆహారానికి అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.
Today Breaking Live Telugu news webportal from Indain states of Andhrapradesh & Telangana. Visit TS MESSENGER Telugu News
ReplyDelete