డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మద్యం సరఫరా…
కేరళ సర్కారు వినూత్న ఆలోచన:
కరోనా లాక్డౌన్ సందర్భంగా మద్యం దుకాణాలు మూతపడడంతో కొన్నిప్రాంతాల్లో మద్యానికి బానిసైనవారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలో ఇలాంటి మరణాలు అధికం. దీంతో కేరళ ప్రభుత్వం మందుబాబులకు కాస్త వెసులుబాటు ఇచ్చింది.
డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉన్న వారికి మద్యం అందించాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మద్యానికి బానిసైన వారికి చికిత్స అందించాలని సూచించారు. అకస్మాత్తుగా మద్యం లభించకపోవడం సామాజిక సమస్యలకు దారి తీయవచ్చని చెప్పిన సీఎం, ఆన్లైన్లో మద్యం అమ్మకంకు ఉన్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
Post a Comment