అర్ధరాత్రి నుంచి ముంబయిలో మాల్స్ మూసివేత…
మహారాష్ట్రలో ప్రధాన నగరాల్లో అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ముంబయి, నవీ ముంబయి, ఠానే, నగ్పూర్, పింప్రీ – చించ్వాడ్ ప్రాంతాల్లో ఈ సముదాయాలను అర్ధరాత్రి నుంచి ఈ నెల 30 వరకు మూసివేస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఎపిడిమిక్ చట్టం 1897ను అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. మీడియా ప్రతినిధులు కూడా ఆస్పత్రులకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 17 కేసులు నమోదు కాగా.. అందరినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచామన్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఏమీ లేదన్నారు. ఇద్దరు తప్ప మిగతా 15 మంది దుబాయి, ఫ్రాన్స్, అమెరికా నుంచి వచ్చినవారేనని సీఎం వివరించారు.
Post a Comment