కరోనా: యాంకర్ ప్రదీప్ పెద్ద మనసు…


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. వీటిలో సినీ, టెలివిజన్‌ రంగాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.



ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరందరికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.



‘ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఇంట్లో ఉండటం చాలా చాలా సేఫ్. అలా ఉండటమే చాలా ఉత్తమం. మనం ఇంట్లో ఉండటం కరోనా వ్యాప్తి చెందకుండా దాని చైన్‌ను బ్రేక్ చేసినవాళ్లం అవుతాం. మన ద్వారా వేరేవాళ్లకు కానీ.. వాళ్ల ద్వారా మనకి కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండటం వెరీ వెరీ సేఫ్. దయచేసి అందరూ దీన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఫాలో అవుతున్న వాళ్లు దాన్నే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను.

No comments

Powered by Blogger.