నెలసరి ఆలస్యమవ్వకుండా రెగ్యులర్‌గా రావాలంటే, కొన్ని ఇంటి చిట్కాలు మీకోసంఋతుచక్రం స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఋతుచక్రాన్ని బహిష్టు, నెలసరి అని కూడా అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ అంటారు. కొంతమందికి నెలసరి పెద్ద సమస్య. ఒక్కోసారి వారం పదిరోజులు ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు రెండు, మూడ్రోజుల ముందే వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా పీరియడ్స్‌ రావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు. కప్పు నీటిలో తాజా అల్లం ముక్కను వేసి బాగా మరిగించాలి.ఐదు నిమిషాల తర్వాత దీన్ని వడకట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాస్తంత తేనె కలిపి దీన్ని ప్రతి రోజూ భోజనం తర్వాత తాగాలి. దీనివల్ల పీరియడ్స్‌ సమయానికి వస్తాయి. రుతు సమస్యలను సరిచేసే గుణం సోంపులో ఉంటుంది. రెండు టీ స్పూన్ల సోంపును తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆనీటిని వడబోసి తాగాలి. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. దాల్చిన చెక్కని పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌ను గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. అంతే కాకుండా రోజూ తీసుకునే ఆహారంలో ఈ పొడిని చల్లుకొని తినవచ్చు.

ఇలా క్రమం తప్పకుండా చేస్తే పీరియడ్స్‌ రెగ్యులర్‌గా అవుతాయి. హార్మోన్ల మార్పులవల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో రుతుక్రమం ఆగిపోతుంది. పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకుంటే మంచిది. క్యారెట్‌, ద్రాక్ష వంటివి జ్యూస్‌గా తీసుకుంటే రుతు సమస్యలు దూరమవుతాయి. మహిళల్లో ఒత్తిడి కారణంగా కూడా రుతుక్రమ సమస్యలు ఏర్పడతాయి. ప్రతి రోజూ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్‌గా ఉంటాయి. దీనివల్ల రుతుక్రమ సమస్య తగ్గుతుంది.

No comments

Powered by Blogger.
close