మా “అమ్మకి వరుడు కావాలి” కూతురు ప్రకటన…


! మా “అమ్మకి వరుడు కావాలి” కూతురు ప్రకటన !టెక్నాలజీని నేటి యువత విచ్చల విడిగా వాడేస్తోంది. సామాజిక మాద్యమాలు విస్తరించడం వంటి పరిణామాల నేపథ్యంలో యువత ఆలోచనల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం ఈ యువతే. ఒంటరిగా జీవనం గడుపుతున్న తన తల్లికి 50 ఏండ్ల అందమైన వరుడు కావాలంటూ ఆస్థా వర్మ అనే యువతి సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రకటన ఇచ్చింది.అంతేకాకుండా కాబోయే వరుడికి కొన్ని కండిషన్లు పెట్టింది. వరుడు శాకాహారి అయ్యుండాలని, తాగుడు అలవాటు ఉండకూడదు, జీవితంలో స్థిరపడిన వ్యక్తికి తమ ప్రాధాన్యత అని ఆస్థా వర్మ ట్విట్టర్ లో పేర్కొంది. కాగా, తాను వివాహం చేసుకుని వెళ్లిపోతే తల్లికి తోడు ఎవరుంటారనే ఆలోచన రాగానే ఈ ప్రకటన ఇచ్చానని ఆస్థావర్మ చెబుతోంది. నెట్టింట్లో ఆస్థా ఇచ్చిన పెళ్లి ప్రకటనకు అనూహ్య స్పందన వస్తుంది.

No comments

Powered by Blogger.