భారత్ లో కరోనా హై అలర్ట్… మూడుకు చేరిన మృతుల సంఖ్య..!


భారతో కరోనావైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా మరో కరోనా వైరస్‌ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు కాసేపటి క్రితం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా కారణంగా మృతి చెందిన వారి వారి సంఖ్య మూడుకు చేరింది.ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు కర్నాటకకు చెందిన వారు కాగా రెండో మృతి ఢిల్లీలో జరిగింది. భారత్‌లో ఇప్పటివరకూ 125 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా కట్టడికి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత దేశంలోనే అధికంగా ఉంది.ఇక్కడ ఇప్పటివరకు అత్యధికంగా 36 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈరోజు నమోదైన కరోనా మరణం ఆ రాష్ట్రంలో మొదటిది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం నాగపూర్‌ సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించింది. షిరిడీ సహా పలు ప్రముఖ ఆలయాలు, ప్రాచీన కట్టడాలను సైతం మూసేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7వేలకు చేరింది. మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

No comments

Powered by Blogger.