ఇదో విచిత్రమైన కేసు ! తెలిస్తే నవ్వాపుకోలేరు…


ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు రసిక రంగారావులు.. ఇటీవలే బ్యాంకాక్ వెళ్లొచ్చారు. దీంతో వీరి ట్రావెల్ హిస్టరీ పట్టుకుని పోలీసులు ఇంటికొచ్చి హోమ్ క్వారంటైన్ కి ఆదేశాలిచ్చారు. మీరు బ్యాంకాక్ నుంచి వచ్చారు, బైటకు రావొద్దు అని ఆదేశాలిచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరూ ఇంట్లో భార్యలకి మాత్రం తాము బిజినెస్ పనిమీద బెంగళూరు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారట.బెంగళూరు పేరు చెప్పి మనోళ్లు బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేసొచ్చారన్నమాట. తీరా పోలీసులు తమ ట్రావెల్ హిస్టరీ పట్టుకొచ్చే సరికి ఎక్కడలేని ఫ్రస్టేషన్ తన్నుకొచ్చింది. భార్యలకి మొహం చూపించలేక, ఇటు పోలీసులపై తిరగబడ్డారు. అరకొర బట్టలతోనే బొటకొచ్చేసి క్వారంటైన్ నోటీస్ చించిపారేశారు. ఆ తర్వాత ఇంట్లో భార్యల చేతిలో బడితె పూజ జరిగి ఉంటుందని వేరే చెప్పాలా.. ౟ ఈ ఇద్దరి బండారం ఇప్పుడు నెటిజన్లకు మంచి విందు భోజనం అయింది. ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోకులు పేలుతున్నాయి.

No comments

Powered by Blogger.