వామ్మో.. సమంత..!టాలీవుడ్‌ ముద్దుగుమ్మ సమంత అక్కినేని ఫిట్‌నెస్‌ విషయంలో తరచూ తన అభిమానులను ఫిదా చేస్తుంటారు. తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను సైతం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సమంత జిమ్‌లో తన వర్కౌట్లకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు.

వర్కౌట్లలో భాగంగా 100 కిలోల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన సామ్‌, ‘మరలా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా పాత నేస్తమా, 100 కేజీల సుమో డెడ్‌ లిఫ్ట్‌’ అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వామ్మో సమంత నువ్వు సూపర్‌’, ‘సమంత నువ్వు పవర్‌ ఫుల్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.


No comments

Powered by Blogger.