వరంగల్: చేతిపై క్వారంటైన్‌ ముద్ర ! యథేచ్ఛగా రోడ్లపైకి…!


ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులపాటు బయటకు రాకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తోంది.అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల చేతులపై క్వారంటైన్‌ ముద్రలు ఉండటం ఆందోళనకు గురి చేసింది.ద్విచక్ర వాహనంపై వెళ్తు్న్న ఓ యువతి, యువకుడి చేతిపై ప్రభుత్వ క్వారంటైన్‌ ముద్ర ఉండటంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ వ్యక్తి హోం క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది యువకుడిని ఆస్పత్రికి తరలించారు.No comments

Powered by Blogger.
close