లాక్‌డౌన్‌ వల్ల సరైన భోజనం లేక బాధపడుతున్న సినీ కార్మికులకు…


మెగాస్టార్‌ చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సి.సి.సి)కి కథానాయకుడు ప్రభాస్‌ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. లాక్‌డౌన్‌ వల్ల సరైన భోజనం లేకబాధపడుతున్న సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఇప్పటికే ప్రభాస్‌ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.ఇప్పుడు చిత్ర పరిశ్రమలోని కార్మికుల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చారు. కరోనాపై పోరాటానికి ప్రభాస్‌ ఇప్పటి వరకు మొత్తం రూ.4.5 కోట్లు విరాళం అందించారు.
అదేవిధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ సి.సి.సికి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించింది. ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌కు చిరు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు చెప్పారు.కథానాయకుడు అల్లు అర్జున్‌ సి.సి.సికి రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. ఆయన ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 లక్షలు విరాళం అందించారు. తాజా సాయంతో విరాళం మొత్తం రూ.1.45 కోట్లకు చేరింది.

No comments

Powered by Blogger.