నాకు వరుడు కావలెను..


అదాశర్మ తనకు వరుడు కావలెను అని తన ట్విటర్ వేదికగా ప్రకటించింది. పెళ్ళి కుమార్తె గెటప్‌లో ఫోటోలను షేర్ చేస్తూ ఈ ప్రకటన చేసింది. అయితే తనకు కాబోయే మొగుడికి చాలా స్పెషల్ క్వాలిటీలు వుండాలని షరతులు పెట్టింది. అవేంటో చూద్దాం.అతడు ఉల్లిపాయలు తినకూడదు. అతని రంగు, కులం, ఫాలోవర్స్‌, రాశుల గురించి నాకు ఎలాంటి పట్టింపులు లేవు. అతడు కచ్చితంగా మూడు పూటలు నవ్వుతూ వంట చేయాలి. గడ్డం పెంచకుండా క్రమం తప్పకుండా నీటుగా షేవ్‌ చేసుకోవాలి. కేవలం సంప్రదాయ దుస్తులు ధరించాలి. రోజుకు 5 లీటర్ల మంచి నీరు తాగడానికి అందిస్తా కానీ మద్యం, మాంసాహారం అస్సలు ముట్టుకోవద్దు. అతడికి భారత్‌లోని అన్ని భాషా చిత్రాలపై గౌరవం ఉండాలి, వాటిని చూసి ఎంజాయ్‌ చేసేవాడై ఉండాలి. ఇలాంటి అర్హతలు వున్న పెళ్లికొడుకు కావాలి’ అని ఆమె ట్వీట్ చేసింది.ఆమె ట్వీట్‌పై చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను రెడీ అంటే నేను రెడీ అన్న రేంజులో కొంతమంది తమ ఫోటోలను పెడుతున్నారు. తమకు ఆ క్వాలిటీలు నిండా వున్నాయని చెబుతున్నారు. చూడాలి మరి అదాకు నచ్చినవాడు ఏడ వున్నాడో ఎలా పట్టుకుంటుందో? ఆ అదృష్టం తమకు దక్కితే లక్కే అంటున్నారు కొందరు. చెడు అలవాట్లు వున్నా అదా కోసం అవన్నీ వదులుకుంటామని మరికొందరు త్యాగాలకు సిద్ధపడుతున్నారు…

No comments

Powered by Blogger.