వరంగల్: విద్యార్థిని మెడలో తాళిబొట్టు.! సోషల్‌ మీడియాలో వైరల్‌ ఫొటోలు…వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అదృశ్యమైనట్లు మంగళవారం ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బుధవారం సోషల్‌ మీడియాలో ఉంచిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. బాలిక మంగళవారం తన బంధువుల ఇంటి నుంచి అదృశ్యం కాగా, మెడలో తాళిబొట్టు, తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.ములుగు జిల్లాలోని కొడిశెలకుంట గ్రామంలో బంధువుల వద్ద ఉంటూ, మూడుచెక్కలపల్లె ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఆశ్రమ పాఠశాలలోనే ఉండి చదువుకోవాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా మూడు నెలల నుంచి ఆమె డే స్కాలర్‌గా పాఠశాలకు హాజరవుతోంది..ఆశ్రమంలో డే స్కాలర్స్‌కు అవకాశం లేకున్నా అధికారుల నిర్లక్ష్యంగానే ఈ సంఘటన జరిగినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా, విద్యార్థి అదృశ్యమైన సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. బాలిక వివాహం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు మంగళవారం రాత్రి నుంచి దర్శనమిస్తున్నాయన్నారు. త్వరలోనే వారి ఆచూకీ కనిపెడతామన్నారు.

No comments

Powered by Blogger.