వరంగల్ లో విమానాశ్రయ అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు: కేంద్ర మంత్రి


వరంగల్ లోని మామునూర్ లో విమానాశ్రయం నిర్మించాలంటూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇతర ఎయిర్పోర్టు డెవలపర్ల నుంచి కానీ ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. గురువారం లోకసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘దేశవ్యాప్తంగా హరిత విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పాలసీ విడుదల చేసింది .

దీని ప్రకారం కేంద్ర పౌరవిమానాయాన శాఖ నుంచి సూత్రప్రాయ అనుమతులు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎయిర్పోర్టు కంపెనీ కానీ, వ్యక్తులు కానీ విమానాశ్రయాలు అభివృద్ధి చేయవచ్చు. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనుకున్న వారు తొలిదశలో స్థల అనుమతుల కోసం మొదట స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ విధానం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ కేంద్రానికి ప్రతిపాదనలు రాలేదు. అయితే రాష్ట్రంలో విమానయాన మౌలికవ సతుల అభివృద్ధికి గల సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా, వరంగల్ స్థలం ( మాముసూర్ ) పై ప్రాథమిక అధ్యయనం చేసింది ” అని కేంద్ర మంత్రి వివరించారు….

No comments

Powered by Blogger.