మారుతీరావు సూసైడ్ లేఖ ! అమృత గురించి ఏం రాశాడో చుస్తే కన్నీళ్లే...

తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ ! ఆ తండ్రి చివరి శ్వాసలోనూ కూతురు కోసమే…


ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటనా స్థలం నుంచి పాయిజన్‌ బాటిల్‌, సూసైడ్‌ నోట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు రాసినట్లుగా భావిస్తున్న ఆ సూసైడ్‌ నోట్‌లో ‘‘ గిరిజ క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాసి ఉంది. ప్రణయ్‌ హత్య కేసులో ఏ1నిందితుడిగా ఉన్న మారుతీరావుకు కోర్టు కొద్దినెలల క్రితం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
No comments

Powered by Blogger.
close