పునర్నవి హాట్ యోగ, వైరల్‌గా మారిన పిక్స్…


పునర్నవి భూపాలం తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం తోటి ఇంటి సభ్యుడు రాహుల్‌తో సాన్నిహిత్యంగా మెలగడం, వీరి కెమిస్ట్రీని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయడంతో ఈ భామకు యూత్‌లో అదిరిపోయే పాపులారిటీ వచ్చింది. అంతెందుకు చాలా మంది వ్యువర్స్ కేవలం ఈ ఇద్దరీ కెమిస్ట్రీని చూడటానికి ఇష్టపడేవారు. దీనికి తోడు రాహుల్, పునర్నవి ప్రేమించుకుంటున్నారని ఓ టాక్ కూడా బయటకు వచ్చింది.దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యారు ఈ ఇద్దరూ, అంతేకాదు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాహుల్, పునర్నవి మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌‌తో మాట్లాడుతూ: ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అంతేకాని లవర్స్ కాదంటూ స్పష్టం చేశారు. అది అలా ఉంటే కరోనా వల్ల బయటకు వెళ్ళే పరిస్థితి లేదు.కాదని వెళ్తే పోలీస్‌లు ఒళ్లు పచ్చడి చేసి పంపించడం ఖాయం. దీనికి తోడు సినిమా షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో ఖాళీగానే గడుపుతున్నారు సినీ నటులు. కాబట్టి ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా కొందరూ ఇంట్లో ఉంటూ వంటలు నేర్చుకుంటుంటే.. మరికొందరూ వర్కౌట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోలను వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ జాబితాలోకి పునర్నవి కూడ చేరింది. తాజాగా పునర్నవి ఇంట్లోనే ఉంటూ రకరకాల యోగాసనాలు వేస్తూ అదిరిపోయే పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.

No comments

Powered by Blogger.