సినీ నటి జ‌య‌ప్ర‌ద‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ !ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు..

ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థినిగా రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సమాజ్‌వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు పెట్టిన కేసులో రాంపూర్ కోర్టు జయప్రదకు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వతేదీన జరగనుంది. గతంలో రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జయప్రద ఎంపీగా గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీలో చేరిన జయప్రద ఆ పార్టీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగి లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు

No comments

Powered by Blogger.